Tuesday, July 14, 2020

PRATHAM SOPAN (TELUGU)

          ప్రథమ సోపాన్

 

1.పెట్రోల్ పద్ధతి (Patrol system)

2. చేతి సంకేతాలు  ( Hand signals)

3. జాడల గుర్తులు ( Wood craft signs )

4. తాడు యొక్క కొసకట్టు ( wipping)

5. ట్రూప్ వారి ఆట ( Troop Game)

6. డ్రిల్  (Drill)

7. ప్రథమ చికిత్స పెట్టె (First aid box)

8.పెట్రోల్ డే హైక్ (Patrol day hike)

9.గ్యాడ్జెట్ ( Gadjet)

10. పరిశుబ్రత(Cleanliness)

11. ప్రకృతి పరిశీలన( Nature study)

12. పరోపకారము     ( Good turn )

13. సేవ కార్యక్రమము ( Service camp) 

 

1.పెట్రోల్ పద్ధతి (Patrol system):-

ప్రతి స్కౌట్ / గైడ్ తన కర్తవ్యమును నిర్వర్తించుటకు తను ఒక్కరు కాకుండా కొంతమందితో కలసి పనిని పూర్తి చేయును.పని చేయాలన్న తోటివారి సహాయము చాలా అవసరము. జట్టుగా ఏర్పడి పనిచేయుటలో ఎంతో ఆనందము ఉండును.అలుపు ఎరగకుండా పనులు చేయగలరు.

పిల్లల మనస్తత్వాన్ని బాగా ఎరిగిన స్కౌట్ పితామహుడు బేడెన్ పావెల్ గారు "పెట్రోల్ " అను కొత్త పద్ధతిని ఏర్పరచినారు.ఇలాంటి కొన్ని జట్ల కలయికే ట్రూప్. హైక్ వెళ్ళునప్పుడు , అందరూ కలసి పాడుతున్నప్పుడు పెట్రొల్ పద్ధతిన వంట చేయునప్పుడు ఎంతో సంతొషము పొందుతారు.

ఒక ట్రూప్ లో కనీసము రెండు పెట్రోల్ లు ఉండవలెను.ప్రతి పెట్రోల్ నందు కనీసం 6 గురు లేదా 8మంది స్కౌట్ / గైడ్ లు ఉండాలి. పెతృఓల్ లీడరు రెండో పెట్రోల్ లీడరు, ట్రూప్ లీడరు, అసిస్టెంట్ ట్రూప్ లీడరు అందరూ కలసి 24/ 32 మంది మించరాదు.మరియు 12మందికి తగ్గరాదు.

పెట్రోల్ లీడరు (Patrol leadar)

----------- :-

 ఎనిమిది లేదా ఆరుగురు సభ్యులు గల జట్టునకు ఉన్న నాయకున్ని పెట్రోల్ లీడర్ అంటారు. C.O.H  లో స్కౌట్ మాస్టర్/ గైడ్ కెప్టెన్ సలహా మేరకు ఎన్నుకోబడతారు. ఇతను / ఈమె అందరు స్కౌట్ /గైద్ లాగా యునిఫాం మాత్రమే కాకుండా అధనముగా కాటన్ లేదా ఊలుతో చేయబడిన 6 సెం.మీ పొడవు, 1.5 సెం.మీ వెడల్పు కలిగిన రెండు ఆకుపచ్చ పట్టీలు మెంబర్ షిప్ బ్యాడ్జ్ కి రెండువైపులా ధరించవలెను.మరియు పెట్రోల్ జండాను కూడా పట్టుకొని ఉండవలెను.

 

రెండవపెట్రోల్ లీడర్ (Patrol second)

---------------------------------------:-    మొదటి పెట్రోల్ లీడరు అనుపస్ఠితిలో రెండవపెట్రోల్ లీడర్ జట్టునకు నాయకత్వము వహించును. రెండవ పెట్రోల్ లీడరును 6 /8 మంది సభ్యులనుండియే స్కౌట్మాస్టర్ / గైడ్ కెప్టెన్ ఆధ్వర్యంలో కోర్ట్ ఆఫ్ ఆనర్ ద్వారా ఎన్నుకో బడతారు. ఇతను / ఈమె కూడా స్కౌట్/ గైద్ దుస్థులే కాకుండా అధనముగా 6 సెం.మీ పొడవు , 1.5 సెం.మీ వెడల్పు గల ఆకుపచ్చ పట్టీ ఒకటి ఎడమ జేబునకు మెంబర్ షిప్ బ్యాడ్జ్ కి కుడివైపున ధరించ వలెను.

 

పెట్రోల్ ఇన్ కౌన్సిల్ (Patrol in council)

----------------------------------------:-ఫ్రతి పెట్రోల్ ఒక పెట్రోల్ ఇన్ కౌన్సిల్ నిర్వహించవలెను. పెత్రోల్ ఇన్ కౌన్సిల్ నందు జట్టులో నున్న స్కౌట్ / గైడ్ లు అందరూ సభ్యులుగా ఉంటారు.మొదటి పెట్రోల్ లీడర్ దీనికి చైర్మన్ గా ఉండును.దీనిలో వారి స్కౌట్/ గైడ్ కు సంబంధించిన కార్యకలాపాలు, అంతరంగిక విషయాలు, ఆర్థిక సంబంధ విషయాలుచర్చించుకుంటారు.

ట్రూప్ లీడర్ ( Troop leader):-

-------------------------------

స్కౌట్ మాస్టర్/ గైద్ కెప్టెన్ పర్యవేక్షణలో కోర్ట్ ఆఫ్ ఆనర్ లో ఊన్న పెట్రొల్ లీడర్లనుండి ఎన్నుకోబడతారు. కనీసం "ద్వితీయ సోపాన్" కలిగియున్న మరియు ఆరు నెలలు పెట్రోల్ లీడరుగా ఉన్న స్కౌట్/ గైడ్ ను ఎన్నుకుంటారు. పెట్రోల్ లీడర్ బ్యాడ్జ్ కి అధనముగా దీర్ఘచతురస్రాకారపు ఆకుపచ్చ పట్టీపై పసుపు పచ్చని రంగుగల మూడు సమాంతర పట్టీలను ధరిస్తారు

 

అసిస్టెంట్ ట్రూప్ లీడర్ (Assistent Troop leader ):-

------------------------------------------- ద్వితీయ సోపాన్ పూర్తిచేసి కనీసం ఆరు నెలలు పెతృఓల్ లీడర్ గా పనిచేసిన పెట్రోల్ లీడర్లనుండి ఒకరిని అసిస్టెంట్ ట్రూప్ లీడర్ గా ఎన్నుకొంటారు. కోర్ట్ ఆఫ్ ఆనర్ లో యునిఫాం కు అధనంగా పెట్రోల్ లీడర్ పట్టీలకు అధనంగా అసిస్టెంట్ ట్రూప్ లీడర్ బ్యాద్ఝ్ ని ఎడమజేబుపై ధరించవలెను.జర్సీని ధరించిన ఎడల జెర్సీ ఎడమజేబూండు స్థానములోనే బ్యాడ్జి ధరించవలెను.తన త్రూప్ ఆజ్ఞమేరకు అసిస్టెంట్ ట్రూప్ లీడర్ నడుచుకుంటారు. దీర్ఘచతురస్రాకారపు పట్టీపై స్కౌట్/ గైడ్ ఎంబ్లం  మరియు ఆకుపచ్చ రంగుగల మూడు అమాంతర పట్టీలు ధరిస్తారు.

 

కోర్ట్ ఆఫ్ ఆనర్ ( Court of honour):-

------------------------------------ ప్రతి స్కౌట్/ గైడ్ త్రూప్ నందు C.O.H  (గౌరవ సభ) నిర్వహించవలెను. గౌరవ సభలో ప్రతి పెట్రోల్ లీడర్,సెకండ్ పెట్రోల్ లీడర్, ట్రూప్ లీడర్ , అసిస్టంట్ ట్రూప్ లీడర్ అందరూ సభ్యులుగా వ్యవహరిస్తారు. సభలో ట్రూప్ లీడర్ అసిస్టంట్ ట్రూప్ లీడర్ , పెట్రోల్ లీడర్ నుండి ఒకరిని చర్మన్ గా ఎన్నుకుంటారు.క్యాంప్ లో చేయు కార్యక్రమాలు, పోటీల్, హైక్ లో నిర్వహించే కార్యక్రమాలు,ఆర్థిక సంబంధ విషయాలు, చేయవలసిన పనులు, పోటీలు వివిధ సేవా కార్యక్రమాలు చర్చిస్తారు.ఇందులో చర్చించిన విషయాలు రహస్యముగా ఉంచవలెను మరియు అందరూ తప్పక పాటించవలెను.

 

పెట్రోల్ పేరు (Patrol Name ):-

--------------------------- ప్రతి పెట్రోల్ కు ఒక పేరు ఉండాలి బాగా ఆలోచించి స్భ్యులందరూ కలసి ఒక పేరును నిర్ణయించుకోవాలి స్కౌట్ పెట్రోల్ కు జంతువుల లేదా పక్షుల పేర్లు మరియు గైడ్ పెట్రోల్ లకు పూల పేర్లు ఎన్నుకోవాలి.రోజూ గమనిస్తున్న  జంతువుల, పక్షుల, లేదా పూల పేర్లు పెట్టుకొని వాటి స్వభావాలు, చరిత్ర జీవన విశేషాలు మొదలగు వాటిని పరిశీలించ వీలగును.

 

పెట్రోల్ జండా(PaTrol Flag):-

---------------------- ప్రతీ పెట్రొల్ నకు ఒక జండా ఉంటుంది తమ పెట్రోల్ పెరునకు సంబంధించిన జంతువు లేదా పక్షి యొక్క గుర్తుగలిగిన జండాను తయారుచేసుకోవాలి.జండా త్రిభుజాకారపు తెల్లని వస్త్రము మధ్యలో ఎరుపురంగుతో పెట్రొల్ పేరుగల పక్షి లేదా జంతువు బొమ్మను ముద్రించాలి.జండా 20 సెం.మీ వెడల్పు, 30 సెం.మీ పొడవు ఉండవలెను.ఇది పెట్రోల్ లీడర్ వద్ద ఉంటుంది. హైక్ లకు వెల్లునప్పుడు పెట్రొల్ లీడర్ పట్టుకొని నడుచునప్పుడు చాలా హుందాగా ఉంటుంది.

 

పెట్రోల్ స్వభావము :-

-------------------- పెట్రోల్ పేరు ప్రకారం ఆయా జంతువులయొక్క స్వభావములను అర్థం చేసుకొని ఆప్రకారంగా ప్రవర్తిస్తారు  .ఎలుగుబంటి గుర్తు ఉన్న వారు వారి లక్ష్యం గట్టి పట్టుగా గుర్తుంచుకోవలెను. చిరుతపులి గుర్తు ఉన్న వారు అతి వేగం , ఏనుగు గుర్తు ఉన్న వారు బలవంతులుగా, పెద్దపులి గుర్తు గలవారు శౌర్యవంతులుగా, పావురము శాంతి, నక్క టక్కరి ఇలా వాటి స్వభావాలు తెలుసుకొని అలా మసలుకోవలెను.

పెట్రోల్ కూత ( Patrol Cry ) :-

---------------------------     తమ జట్టుకు ఎంచుకునే గుర్తు పక్షులు లేదా జంతువుల కూతను గుర్తుంచుకొనవలెను.దానిని అనుకరించగలిగి ఉండవలెను .తమ పెట్రోలు పేరును తమ అరుపుల ద్వారా తెలియజెప్పవచ్చును.స్కౌట్ మాస్టర్/ గైడ్ కెప్టెన్ ఫ్లాగ్ పరేడ్నకు  పిలుచునప్పుడు , గుర్రపునాడ ఆకారం లోకి ( Horse shoeformation  ) వచ్చునప్పుడు కూత ద్వారానే అరుస్తూ రావాలి. ఎద్దు గుర్తు ఉన్న వారు అంబా- అంబా అని, గుర్రం గుర్తు ఉన్న వారు హీ..హీ హీ అని సకిలిస్తూ ఏనుగు గుర్తు ఉన్న వారు ఘీంకరిస్తూ. పులి గుర్తు ఉన్న వారు గాండ్రిస్తూ రావాలి.

 అలాగే హైక్ వెళ్ళినప్పుడు అటవీ ప్రదేశ్మునకు వెళ్ళీనప్పుడు తన పెట్రోల్ వారు తన దగ్గరకు రావడానికి పెట్రోల్ లీడర్ వారి అరుపుల ద్వారానే దగ్గరకు పిలుచుకుంటారు

 

పెట్రోల్ వారి ప్రత్యేక స్థలము ( Patrol corner ):-

--------------------------------------తమ జట్టు వారు ఒకచోట కూడి ఉండుటకు ఒక స్థలమును నిర్ణయించుకొనవలెను.స్కౌట్/ గైడ్  గదియందుకానీ లేదా స్కౌట్ మాస్టర్/ గైడ్ కెప్టెన్  గారు కెటాయించిన స్థలమునందు తమ సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చును .తమ పెట్రోల్ కు సంబందించిన పక్షి/ జంతువు బొమ్మలను సేకరించుకొని పాటలను ఇతర సమాచారమును తమకు కెటాయించిన గోడలపై లేదా తెరలపై చూపించవలెను.

తమపుస్తకములను, నోట్స్ లను ఇతర స్కౌట్/ గైడ్ సామానులను దాచుకోవచ్చును .ఇవే కాకుండా పెట్రోల్ వారిగా ఉండు తాళ్ళు, గొడ్డలి , కర్రలు మొదలైనవి ఉంచుకోవచ్చును. తమ ప్రత్యేక స్థలములో ఉంచుకోవలసిన కొన్ని పుస్తకాల పేర్లు క్రింద పొందుపరచబడినవి.

1. Scouting for Boys

2. Troop Scouter

3.Life story of B.P

4. APRO - Part 2

5. Games gallory

6. Pioneering

7. Know your patrol...మొదలగునవి

 

చేతి సంకేతాలు ( Hand Signals) :- బేడెన్ పావెల్ గారు తన  స్కౌటింగ్ ఫర్ బాయిస్ (Scouting for Boys ) అను పుస్తకములో " క్యాంప్ ఫైర్ యార్న్ 7 " నందు హాండ్ సిగ్నల్స్ గురించి  చక్కగా వివరించారు. పెట్రోల్ లీడర్ లేదా ట్రూప్ లీడర్ / కంపనీ  లీడర్ తనకు అవసరము వచ్చినప్పుడు చేతి సంకేతాల ద్వారా ఆజ్ఞలను ఇవ్వవచ్చును. స్కౌట్ మాస్టర్/ గైడ్ కెప్టన్ కూడా తనకు అవసరమైనప్పుడు ఇలా చేతి సైగలద్వారా ఆజ్ఞలను ఇవ్వవచ్చును.

Hand Signals  ను సైలెంట్ సిగ్నల్స్ అని కూడా అంటారు. ఎవరైనా సిగ్నల్స్ ఇచ్చునప్పుడు క్రింది విషయాలను గమనించవలెను

1. Scout/ Guide  ఆరుబయట ఉన్నప్పుడు మాత్రమే ఇట్టి ఆజ్ఞలను ఇవ్వవలెను

2.వారు అలర్ట్ గా ఉన్నారా లేదా అనే విషయాన్ని గమనించాలి.

3.సిగ్నల్స్ ఇచ్చువారు కొంత మేరకు ఎత్తైన ప్రదేశం లో ఉండాలి. తొందరగా అందరూ గమనించునట్లు ఉండాలి.

4.గుర్తులను , సరియగు సమయము ఇచ్చి చురుకుగా చేయాలి.

5. మీరు ఇచ్చు ఆజ్ఞలను Scout/ Guide  జాగ్రత్తగా అర్థం చేసుకొనుటకు తగిన సమయము ఇవ్వాలి.

దీని ద్వారా క్రమశిక్షణ, తోటివారితో కలసి సర్దుబాటు, ఆజ్ఞలను శిరసావహించడం మొదలయినవి నేర్చుకుంటారు. 

  HanD signals

1. S.M / G.C తన కుడిచేయిని ముఖం మీదుగా ఎడమ భుజం వైపుకు పలుమార్లు ఊపిన ఎడల   "As you were"  పూర్వపు స్థితిలో ఉండుము అని అర్థం

2. కుడి చేయిని ఎత్తుగానుంచి అరచేతిని Scout / Guide   వారికి ఎదురుగా ఉంచిన ఎడల విడిపొమ్ము ( Scatter ) , విస్తరించుము ( Extend) అని అర్థం.

3.S.M / G.C తన కుడిచేతిని భుజం  నుండి తొడ వరకు పలుమార్లు ఊపినేడల "Run up and Down  . చూపించిన స్థలం నందు అటు ఇటు పరుగెత్తుము అని 

4. S.M ? G.C పిల్లలకు ఎదురుగా నిలబడి తన రెండు చేతులను చాచి తన అరచేతులను భూమికి సమాంతరంగా  చాచిన " Form a single line "  S.M / G.C  వైపు ముఖము చేస్తూ ఎదురుగా ఒక పంక్తిలో నిలబడుము అని అర్థం.

5. S.M / G.C  తన రెండు చేతులను శరీరానికి బయటవైపుగా పైకి లేపి మోచేయిని మడిచి రెండుపిడికిల్లు మూసిఉంచిన S.M / G.C ఎదురుగా ముఖము చెసి  పెట్రొలు వెనుక పెట్రోలు ఋఎండడుగుల దూరం లో నిలబడవలెను అని   " fall in , in file  అని అర్థం.

6. S.M / G.C  తన చేతులను చాచి భూమి వైపికు ఉంచి రెండు చేతులను వృత్తాకారంలో ఊపిన ఎడల పిల్లాలు మాస్టారు చుట్టూ వృత్తాకారంలో ఉండవలెనని అర్థం.

7.  S.M /G.C తన అరచేతులను ఎదురెదురుగా ఉంచి సగమువరకు అనగా నడుమువరకు పైకి లేపి ఉంచిన ఎడల  "Form two lines facing each other "అని అర్థం

8. S.M / G.C  తన రెండు చేతులను చాచి ఎదురెదురుగా ఉంచి భుజాలకు సమాంతరముగా నుండి వెనుకవైపువరకు ఊపిన ఎడల పనిని కొనసాగింపుము " go on  " అని అర్థం.

9.  S.M / G.C  తన అరచేతుల మూడవ వ్రేలును ఒకదానితో ఒకటి తాకునట్లుగా ఉంచి రెండు భుజాలను సమాంతరముగా ఉంచి చూపిన ఎడల ఇచ్చటనుండి వెళ్ళిపొమ్ము "Dismiss" అని అర్థం.

10  Troop/ Company close column :  S.M / G. C తన రెండు చేతులను పిడికిలి బిగించి భుజములు భూమికి సమంతరముగాను లంబముగా తన మోచేతులను ఎత్తవలెను.(మోచేతులదగ్గర లంబముగా ఉండునట్లు చేతులను ముందువైపుకు ఉంచవలెను) ఆజ్ఞకు Scouts / Guides  తమ పెట్రోల్ వారిగా  S.M/ G.C  కు ఎదురుగా వచ్చి ఒక పెట్రోల్ వెనుక ఇంకొక పెట్రోల్ గా నిలుచుందురు. ప్రతి పెట్రోల్కు మధ్య ఒక అంగ దూరము ఉండును.

11. S.M / G.C  తన రెండు చేతులను భూమికి సమాంతరముగా ఉండునట్లు ముందుకు చూపును అరచేతిని లోపలివైపుకు ఉంచును . ఆజ్ఞ కు  Scouts / Guides  S.M ? G.C

 కి ఎదురుగా నాలుగు వరుసలలో నిలబడుదురు.జట్లన్నియు ఒకదాని ప్రక్కగా ఒకటి వరుసల్లో  నిలబడుదురు. లీడర్ ముందుగా వెనుక సభ్యులు చివరగ సెకండ్ లీడర్ నిలబడుదురు.

 గుర్రపునాడ ఆకారము (  Horse Shoe formation  ): S.M / G.C తన రెండు చేతులను క్రిందకు " వి " ఆకారములో ఉంచి నడుముకు సమాన ఎత్తులో ఉంచి సాధ్యమైనంత వెడల్పుగా చేతులను బారుగా చేస్తూ మళ్ళీ చేతులను దగ్గరగా చేసి బోర్లా చాచవలెను అనగా రెండుచేతులను ఒకదానిపై ఒకటి క్రాస్ గా చేయవలెను.దీనికి  Scouts / Guides  గుర్రపునాడ ఆకారంలో  తమ జట్టూ నాయకునికి ఎడమవైపున పెట్రోల్వారిగా నిల్చొనవలెను.

పై ఆజ్ఞలను పాటించునపుడు  Scouts / Guides  చురుకుగా కదిలి పూర్తి నిశ్శబ్ధముగా ఉండవలెను .నిల్చున్న తర్వాత కదులుటగానీ మాట్లాడుటగానీ చేయరాదు.

WOOD CRAFT SIGNS ( జాడల గుర్తులు): ప్రతీ  SCOUT / GUIDE  కు పరిశీలనా జ్ఞానము, గుర్తుల తేడాలను కనిపెట్టు ఆలోచనావిధానము మొదలగు అంశాలను తెలుసుకొనుటకు వీలుగా విషయమును కనిపెట్టినారు. "స్కౌటింగ్ / గైడింగ్  ఈజ్ ఔటింగ్ " అను మాట ప్రతి స్కౌట్ , గైడ్ కు వర్తిస్తుంది.ఔటింగ్ అనునది లేకున్న ఎడల అది స్కౌటింగ్ లేదా గైడింగ్ అనిపించుకోదు.

 Scouting / Guiding is a Game  అని అన్నారు ఆటలు లేకున్నా అది స్కౌటింగ్  , గైడింగ్ అనిపించుకోదు. ఆటలరూపంలో అర్థం చేసుకొని స్కౌట్ / గైడ్ తన గమ్యం చేరుకునె  తెలివిని నేర్పించవలెను.

పట్టణములలో , పల్లెలలో తన గమ్యం చేరుటకు కొన్ని ముఖ్య ప్రదేశములను, భవనముల పేర్లు తెలుసుకొని వాటిద్వారా తాను చేరవలసిన చోటికి చేరును. కానీ కొన్ని సందర్భములలో  అడవిలో , ఆరుబయట ప్రదేశములో , కొండప్రాంతాల్లో తన క్యాంప్ కు చేరవలెనన్న తప్పనిసరిగా కొన్ని గుర్తులను వాడవలెను. వాటిద్వారా మాత్రమే తాను క్యాంప్ నకు  లేదా తన మఖామునకు చేరుకోగలరు.

S.M / G.C ఒక ప్రదేశమును నిర్ణయించుకొని కొన్ని జాడల గుర్తులు వేసుకుంటూ  ప్రడేశ్మునకు చేరును. తరువాత మొదటి పెట్రోల్ వారు జాడల గుర్తులను గమనిస్తూ అవి చూపిన మార్గము ద్వారా నిర్ణీత స్థలమునకు చేరుకొనుటకు ప్రయత్నించవలెను.ఇలా వెళ్ళుటకు ఒక ముఖ్యమైన ఫార్మేషన్ కలదు. దానిని ఈగల్ ఫార్మేషన్ అందురు. ఎందువలన అనగా గ్రద్ధ చాలా దూరం నుంచి ఎత్తునుంచి తన ఆహార ఉనికిని గమనించగలదు.కనుక పేరును పెట్టడం జరిగింది.

జాడల గుర్తులను వేయునప్పుడు క్రింది విషయాలను గుర్తుంచుకొనవలెను.

1. గుర్తులను దారికి కుడివైపున వేయవలెను

2. జాడల గుర్తులు చూసేవారికి తొందరగా కనబడేటట్లు ఉండాలి.

3. గుర్తుకు, గుర్తుకు మధ్య దూరము 15 మీటర్లకు మించరాదు.

4. గుర్తులను నేలపై బొగ్గుతోగాని, చాక్ పీస్ తో గాని వేయవలెను, లేదా కర్రతో నేలపై గీతలను గీయవలెను.

5. గుర్తుల కొరకు అడవిని ధ్వంసం చేయుటగాని, చెట్లకొమ్మలను విరుచుటగానీ రాల్లను పగలగొట్టుట గానీ ఇతర ఆస్థులను నష్టపరచుట గానీ చేయరాదు.

6. అందరికంటే చివరగా వెళ్ళే వారు గుర్తులను చెరిపివేసుకుంటూ వెళ్లాలి.

7. గమ్యం చేరిన తరువాత S.M /G.C  దగ్గర ఉన్న గుర్తులను జాబితాతో పోల్చుకోవాలి. తేడాలను తెలుసుకున్న ఎడల తప్పిదములను తెలుసుకొన వీలగును.

wipping( త్రాడు యొక్క కొస కట్టుట):

త్రాడుయొక్క పురి ఊడిపోయి పనికిరాకుండా ఉన్నప్పుడు కొసలు ఊడిపోకుండా ఉండటానికి కొసకట్టు (wipping ) ఎంతో అవసరము.

పద్ధతి :- సుమారు 3 మీటర్ల పొడవుగల త్రాడు తీసుకొని దానికి మందంగా ఉండే దారం తీసుకొని దానిని ఒక లూప్ ఆకారం తీసుకొని రన్నింగ్ చివరన ఒకదాని ప్రక్కన ఒకటి చుడుతూ చివరి అంచువరకూ రావలెను. రన్నింగ్ చివరను లూప్ లో నుంచి ముందు వదలిన చివరను లాగవలెను.అప్పుడు రోప్ చివరకు కట్టిన ముడి గట్టిగా ఉండును.

KNOTS (ముడులు):-

1. REEF KNOT  :- రెండు సమాన మందము గల త్రాడును కలపడానికి, ప్రథమ చికిత్స బాండేజ్ కట్టునప్పుడు మరియు పార్సిల్ కట్టడానికి ముడిని ఉపయోగిస్తారు.

2.  SHEET BEND  :- రెండు వేరు వేరు మందముగల త్రాడు లను కలపడానికి ముడిని ఉపయోగిస్తారు

3.CLOVE HITCH  :- పశువులను గుంజకు కట్టుటకు ముడిని ఉపయోగిస్తారు. ముఖ్యముగా లాషింగ్స్  వేయునప్పుడు   Clove hitch  తో ప్రారంభించి  clove hitch  తోనే ముగిస్తారు

4.  FISHER MAN'S KNOT :నీటిలో తడిచిన త్రాళ్ళను కలుపుటకు, మరియు జారుడు స్వభావము కలిగిన  నైలాన్ వంటి త్రాళ్ళను కలుపుటకు ముడిని  ఉపయోగిస్తారు.

5. SHEEP SHANK :- పొడవుగా ఉన్న త్రాడును కురచగా చేయుటకు మరియు త్రాడుయొక్క బలహీనమైన భాగమును బలంగా చేయుటకు  ముడిని ఉపయోగిస్తారు.

6.  BOW LINE  :- దీనిని ప్రాణ రక్షక ముడి అనికూడా అంటారు. బావిలో పడిన వారిని  , నీటి ప్రవాహంలో కొట్టుకు పోతున్న వారిని రక్షించుటకు  త్రాడుకు ముడినివేసి వారిని రక్షిస్తారు 

7. Round Turn two half hitch  :- ముడిని ఎక్కువగా గుడారాలు ( TENT ) లు వేయునప్పుడు ఉపయోగిస్తారు Tent  త్రాల్లను మేకులకు కట్టూనప్పుడు ముడిని ఉపయోగిస్తారు .  

  

 

Troop Wide  Game  ( ట్రూప్ వారిగా ఆట):-

ఆటలనగానే బాలబాలికలకు చాలాఇష్టం. ఆటలద్వారా ఆరోగ్యము, శక్తి చేకూరుతుంది అంతేకాక ఆటలద్వారా నైపుణ్యము, మెలకువలు, ఆటలలో చట్టములు తెలుసుకునే వీలుంటుంది. ఆటలద్వారా మానసిక , శారీరక దృఢత్వము కలుగుతుంది నాయకత్వలక్షణాలు పెంపొందుతాయి.ఇంకా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసము, ఆత్మనియంత్రణ, సోదరభావము మొదలయిన లక్షణాలు పెంపొందుతాయి.

గదిలోపలి ఆటలకంటే ఆరుబయట ఆటలు ఎంతో ఆనందకరంగా ఉంటాయి. Troop Games  ఆడుటకు 100 మీటర్ల నుండి 250 మీటర్ల పొడవుగల  స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి.ఆటలాడించునప్పుడు క్రింది అంశములను గుర్తుంచుకోవాలి.

1.ట్రూప్ వారి అభిరుచులను బట్టి ఆటలు ఆడించవలెను

2. ప్రతివారికి అవకాశం దొరుకునట్లు ఆడించవలెను

3.ఆటయొక్క సూచనలను విద్యార్థులకు ముందుగానే వివరించవలెను

4.ప్రతి ఆటలో ఒక క్రొత్త విషయమును నేర్చుకునే విధంగా చూడాలి

5. ప్రతిసారి ఒక క్రొత్త ఆటను ఆడించాలి

6. ఆటలో నియమాలను బాగా అర్థమగునట్లు బోధించి ఆడించాలిలేకపోతే ఆటలలో తప్పులుదొర్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి

.

.

practice orderly movents and simple drill for smartness.

డ్రిల్ లో వ్యక్తిగతంగా, అందరూ కలసి నేర్చుకునే విషయాలు ఉంటాయి. దానివల్ల ఆరోగ్యము, దేహదారుఢ్యము, క్రమశిక్షణ అలవడతాయి

డ్రిల్ వలన క్రింది లాభాలున్నాయి

1.శరీర ఆరోగ్యము, దేహదారుఢ్యము పెరుగును.

2. ఆజ్ఞలను సక్రమముగా పాటించుట నమ్మకముగా నిర్వహించుట

3.ట్రూప్ ఒక ప్రదేశమునుండి మరోప్రదేశమునకు క్రమపద్దతిలో వెల్లుట

4.మానసిక , శారీరక సమతుల్యము పెరుగును

5.ప్రభుత్వ సంబంధిత పరేడ్ లలో పాల్గొనుట వలన దేశ సమైక్యత మరియు నైతిక విలువలు పెంపొందుతాయి

6. డ్రిల్ వలన ఆత్మగౌరవము పెంపొందుతుంది

7. మంచి అలవాట్లు, పనిపట్ల గౌరవము కలుగుతుంది

8. డ్రిల్ వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి

DRILL - CAUTIONS

------------------------

  Attention  -- సావధాన్

   Stand at ease  -- విశ్రాం

   left Turn  - బాయే ముడ్

   right turn - దహినే ముడ్

   abou turn  - పీచే ముడ్

   cover up  -- సజ్

   count  - గింతీ కర్

   as you are  - జైసె థే

   fall in - లైన్  బన్

   break off  - స్వస్థాన్

   Dismiss    - విసర్జన్

   quick march  - తేజ్ చల్

   Forward march  - ఆగే బఢ్

   Right wheel - దహినే ఘూం

   Left wheel  - బాయే ఘూం

   open aorder  march  ఖులీ లైన్  చల్

   close order march  - నికట్ లైన్ చల్

   salute  - సలామీ దే

   stedy    హిలో మత్

   Halt  -థాం

   eyes front - సామ్నే దేఖ్

   eyes right  - దహినే దేఖ్

   eyes left  - బాయే దేఖ్

 

   

    FIRST AID BOX  ( ప్రథమ చికిత్స పెట్టె ) :-

---------------------------------------

ప్రఠమ చికిత్స పెట్టె  ప్రథమ చికిత్సకునికి ఎంతో సహాయ పడుతుంది. డాక్టర్ గారు వచ్చు లోపల రోగికి ప్రథమ చికిత్స చేయడానికి కావలసిన సామానులు అన్ని ఇందులో ఉంటాయి.గృహ ప్రథమ చికిత్సపెట్టె, ఫ్యాక్టరీలలో ఉండే ప్రథమచికిత్సపెట్టె  వేరుగా ఉంటాయి. ఒక ప్రథమచికిత్స పెట్టెలో ఉండే సామానులు క్రిందివిధంగా ఉంటాయి

1. రోలర్ బ్యాండేజ్ (  Roller Bandage) - 2 ( broad )

2. రోలర్ బ్యాండేజ్  ( Roller Bandage ) -2 (  Narrow)

3. గాజు గుడ్డ - ( Lint )   -1

4. దూది (  Cotton  ) -1

5. చిన్న కత్తెర (  small Scissors ) -1

6. నొప్పి నివారణ మాత్రలు (  pain killar Tablets  )-12

7. బ్యాండ్ ఎయిడ్ (  Band Aid  ) -4

8. సేఫ్టీ పిన్స్ (saftey pins ) -12

9. యాంటీ సెప్టిక్ క్రీం (  Anti septic cream )-1

10.యాంటి సెప్టిక్ లోషన్ (  Anti septic lotion )  -1

11.కట్టుడు బద్దలు (  Supporting sticks )-6

12. సోడియం బై కార్బోనేట్ (  sodium bi corbonate )-1

13. ట్రయాంగ్లర్ బ్యాండేజ్ (  Trionglar bandage)-3

14.బర్నాల్ ట్యూబ్ ( భుర్నొల్) -1

15.ప్లాస్టర్ (Plaster)

16. పొటాసియం పర్మాంగనేట్ ( Potassium permanganate ) రోలర్ బ్యాండేజ్ యొక్క ఉపయోగాలు

-------------------------------: - బ్యాండేజ్  మామూలుగా గాజ్ (Gauge) అనే గుడ్డ , లింట్ (Lint ) అనే సన్నని గుడ్డగాని ఉంటుంది. బ్యాండేజ్ రెండురకాలుగా ఉంటుంది

1. బ్రాడ్ బ్యాండేజ్ (Broad Bandage)

2. నారో బ్యాండేజ్ ( Narrow Bandage)

బ్యాండేజ్ కట్టేటప్పుడు క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి

1. గాయపడిన వారికి ఎదురుగా నిలబడి ప్రథమ చికిత్స చేయవలెను

2. శుబ్రమైన మురికి లేనటువంటి గుడ్డలను, దూది , ఇతర బ్యాండేజ్ లను వాడవలెను.తాను శుబ్రముగా ఉండుటకై చేతులను యాంటీ సెప్టిక్ లోషన్ తో  కడుగుకొనవలెను

3. గాయపడినవారిని మంచిమాటలతో ఓదార్చవలెను

4. బ్యాండేజ్ న్ కట్టునప్పుడు గాయముపైనున్న మందు జారనీయరాదు

5. గాయముపై బ్యాండేజ్ గాయముకంటే 2 /3 వంతులు ఎక్కువగా ఉండాలి

6. గాయమునకు వేసిన బ్యాండేజ్ కట్లు మరివదులుగాను లేదా మరీ బిగుతుగాను ఉండరాదు

7. బ్యాండేజ్ కట్టువారి చేతులు గాయమునకు తగలరాదు

Method Of Application  ( చుట్టు కట్టు పద్ధతి )

----------------------------------------:-రోలర్  బ్యాండేజ్ ని క్రింద చూపిన విధంగా 4 పద్ధతులలో కట్టెదరు

1. మామూలు తిరుగుడు కట్టు ( The simple spiral )

2. వెనుకకు తిరుగుడు కట్టు ( Reverse spiral)

3. ఎనిమిది అంకె కట్టూ ( The Figure of eight)

4. స్పైకా కట్టు (The Spoika method)

మామూలు తిరుగుడు కట్టు

--------------------:- ఒకే లావు కలిగిఉన్న అవయవముపై పద్ధతిని అనుసరించవలెను.బ్యాండేజ్ ని తీసుకొని మెట్లవలె కట్టుతూ పైకి వెళ్ళవలెను. కట్టుట పూర్తి అయిన తరువాతమిగిలిన బ్యాండేజ్ ని మధ్యలో చింపి దీనికి Reef knot వేయవలెను లేదా టేప్ తో అతికించవలెను.

వెనుకకు తిరుగుడుకట్టు

-----------------------:-  అంగము దళసరి హెచ్చుతగ్గులు ఉన్నాప్పుడు రివర్స్ స్పైరల్ న్ ఉపయోగిస్తారు .దీనిని చుట్టునప్పుడు సగము చుట్టీ గుడ్డను బయ్టకు మడిచి చుట్టవలెను

ఎనిమిది అంకె కట్టు

----------------------:- కట్టును మోకాళ్ళు, మోచేతికి మరియు కాళ్ళకు గాయాలు , ఫ్రాక్చర్ అయినప్పుడు ఉపయోగిస్తారు.దీనిని ఎనిమిది అంకె(8) మాదిరి గాయానికి చుట్టుతారు .చివరగా Reef knot  వేస్తారు

స్పైకా కట్టు

----------:- ఎనిమిది అంకె కట్టు పద్దతి కానీ దీని చుట్టబడు అవయవము ఒకదానికన్న మరొకటి పెద్దదిగా ఉండును . మడమకు ఒక పక్క ఉన్న కీళ్ళ భాగములకు, భుజము తొంటి, బొతనవేలు మొదలగు వాటికి ఉపయోగిస్తారు   

PATROL DAY HIKE

------------------:-   Hike  అంటే అందరికీ ఆనందకరమైన విషయమే కోర్ట్ ఆఫ్ ఆనర్ నిర్ణయము కాకముందు పెట్రోల్ కౌన్సిల్ లో తీర్మానము చేసుకొనవలెను. వెళ్ళవలసిన తేది, అక్కడికి తీసుకొని వెళ్ళవలసిన సామాను, స్థలము, ఖర్చు, భోజన సదుపాయాలు నిర్వహించు కార్యక్రమాలు మొదలైన వాటి గురించి పెట్రోల్ కార్నర్ లో కూర్చొని నిర్ణయించుకోవాలి.దీనికి నాయకులు పెట్రోల్ లీడర్. ఒకవేళ పెట్రోల్ లీడర్ లేకపోతే రెండవ పెట్రోల్ లీడర్ ఆధ్వర్యం లో నిర్వహించుకోవాలి.దీనికి ట్రూప్ లీడర్/కంపనీ లీడర్, స్కౌట్ మాష్టర్ /గైడ్ కెప్టెన్  యొక్క సలహాలను తీసుకొన వచ్చును.హైక్ వెళ్ళువారు వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. హైక్ ద్వారా స్కౌట్ / గైడ్ కు ప్రకృతిని పరిశీలించే జ్ఞానము కలుగును. హైక్ వెళ్ళే  ప్రదేశము సమతలంగా ఉన్న మైదానము చుట్టు చెట్లు మంచినీటి వసతి, పరిశుబ్రమైన వాతావరణం ఉండాలి. స్థలం యజమానియొక్క అనుమతి తీసుకోవాలి. సమీపములో పక్కా భవనం ఉన్నయెడల వర్షం వచ్చినను అందులో తలదాచుకోవచ్చు           

సమయసారిణి( Time -Table)

--------------------------

. 7గం.లకు  హైక్ ప్రదేశానికి చేరుకోవాలి

.8గం.లకు ప్రార్థన, పతాకావిష్కరణ

.8.30 గం లకు అల్పాహారము, టీ

9.గం నుండి 12.గం వరకు బోధనాంశము, కార్యక్రమాలు

12.00 గం నుండి 2.00 ఘ్మ్ వరకు భోజన విరామము

2.00 గం నుండి 4.00 గం వరకు కార్యక్రమాలు

4.00 గం నుండి 5.00 గం వరకు ఆటలు

5.00 గం లకు టీ విరామము

6.00 గం లకు తిరుగు ప్రయాణము , ఫ్లాగ్ ను దించుట

తిరిగి వెళ్ళునప్పుడు స్థలం అంతా శుభ్రంగా చేయాలి

స్థలము యజమానికి కృతజ్ఞతలు చెప్పాలి. తన వెంట తెచ్చుకున్న సామానులను జగ్రత్తగా వాపస్ తెచ్చుకోవాలి

ప్రతి హైక్ వెనుక ఒక ఉద్దేశ్యమును ఎంచుకొని వాటిని నెరవేర్చుకొనుటకు వెళ్ళవలెను.వినోదము, ఆనందము కొరకు వెళ్ళరాదు.వినోదము ఉన్నా దాని వెనుక ఒక నిర్దిష్ట అనుభవము ఒక పాఠం ఉండాలి. హైక్ పూర్తి అయినతరువాత ఒక రిపోర్ట్ రాసి S.M / G.C  కి చూపించాలి          

గ్యాడ్జెట్ (Gadget )

--------------------

 Make a Gadget or Handicraft Useful at home  :- క్యాంప్ లో గ్యాడ్జెట్ నిర్మించుకొనుట అనునది ప్రతి స్కౌట్ / గైడ్ కు తెలిసి ఉంటుంది. బట్టలు ఆరవేసుకునే దండెం, చెప్పుల స్టాండ్, ప్లేట్ స్టాండ్ , లగేజ్ స్టాండ్  ఇలా ఎన్నో రకాల గాడ్జెట్స్ తయారు చేసుకుంటారు.ఇంట్లో వృథాగా పడిఉన్న సామానులను తీసుకొని తన నైపుణ్యమును ఉపయోగించి ఇంట్లో వాడుకొనుటకు ఉపయోగపడే ఏదైనా వస్తువును తయారు చేయాలి అలా చేసిన వస్తువులను ఇంట్లో వాడుకోవాలి.అలాంటి నైపుణ్యం ను S.M / G.C ప్రోత్సహించాలి.

తమ ఇంట్లో వారికి పనికివచ్చు కొన్ని వస్తువులను క్రింద ఇవ్వబడినవి.

1.దూది, రంగు కాగితము ఉపయోగించి అందమైన బొమ్మలను తయారు చేయుట

2. బంకమట్టి , రంగులు ఉపయోగించి చక్కటి బొమ్మలను తయారుచేయుట

3. ప్లాస్టిచ్ ఉపయోగించి రకరకాల వస్తువులను తయారు చేయుట

4. రంగు దారాలతో రకరకాల డిజైన్ లు చేయుట

5. అట్టలచేత ఇంట్లో అందమైన ర్యాక్ లను చేయుట

6. కర్రలు త్రాళ్ళు ఉపయోగించి హ్యాంగర్ లను తయారు చేయుట

7. రంగు కాగితాలతో రకరకాల డిజైన్ లు తయారుచేయుట              

పరిశుబ్రత ( Cleanliness)

 ---------- :- కార్యక్రమంలో భాగంగా వారం రోజులపాటు  సమీపంలోని పార్క్ / వాటర్ పాయింట్ / బస్ స్టాప్/ ప్రజలు సంచరించే ప్రదేశాలలో శుభ్రం చేసి రిపోర్ట్ ను  S.M / G.C కు సమర్పించవలెను.

                                                                                                                                                                              

                                                                                                                                                                                         

   

 

  

 

  

 

 

  

      


No comments:

Post a Comment

my teaching