Tuesday, July 14, 2020

PRAVESH NOTES (TELUGU)

1.History of the movement  (స్కౌట్ ఉధ్యమ చరిత్ర)

స్కౌట్ ఉధ్యమ స్థాపకుడు Robert stephenson smith Baden powel  గారు 1857 సంవత్సరం ఫిబ్రవరి 22 వ తేదీ న లండన్ లో జన్మించారు. ఈయన్ తండ్రి .H.G baden powel  తల్లి Henrita smit వీరికి ఐదుగురు సంతానం అందులొ ఒక కుమార్తె. B.P  గారి మూడవ ఏట వీరి తండ్రి మరణించెను.తల్లి వీరిని భయభక్తులతో పెంచెను.వీరి తల్లి ఒక క్రైస్తవ  మత గురువు కుమార్తె. తండ్రి ఆక్స్ఫర్డ్ యూనివర్సితి లో జామెట్రి ప్రొఫెసర్ గా ఉండెను.

బాల్యము

1969 వ సం. లో లండన్ లోని చార్టర్డ్ హౌస్ పాఠశాలలో మెట్రిక్యులేషన్  చదివెను.ఈ పాటహ్శాల చుట్టూవిశాలమైన అడవి ఉండెను.B.P.  గారు అడవిలో సంచారం చేసే జంతువులను పరిశీలించేవారు. వేటాడుత, అడుగుల జాడలు, అరుపులు ఆటవిక విద్యలను అభ్యసించిరి.1876 లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసెను.తన పాఠశాల జీవితంలో B.P  గారు ఫుట్ బాల్ ఆటలో గోల్ కీపర్ గా వుండేవాడు. ఇంకా తనరెండు చేతులతో బొమ్మలు గీసేవాడు.

       సైనికజీవితం

తన 19 వ ఏట విద్యను ముగించి సైనిక ఉద్యోగం లో చేరి ఉద్యోగంలో భాగంగా 18884 వ సంవత్సరం లో భారతదేశమునకు వచ్చి 1885 నుండి 1895 వరకు పనిచేసెను  తరువాత ఇంగ్లాండు, సౌత్ ఆఫ్రికా, మాల్టా, ఐర్లాండ్ మెదలైన చోట్ల పనిచేసెను. 1897 వ సంవత్సరం లో కల్నల్ గా భారత దేశమునకు వచ్చెను . తన సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి  Aids to scoutinG అనే పుస్తకమును రచించెను.1899 నుండి  B.P  గారుసెలవుపై స్వదేశం వెళ్లెను వెంటనే బోయర్లు (అశాంతి తెగ) వారిని ఎదుర్కొనుటకు దక్షిణ ఆఫ్రికా కు పంపబడెను.ఆఫ్రికాలో mafe king  అనే పట్టణం చాలా ముఖ్యమైనది. B.P గారు తక్కువ సైన్యముతో ఉన్నప్పుడు 9000 మంది బోయర్లు  Mafe king  ను ముట్టదించిరి. అప్పుడు B.P  గారు సమయస్పూర్తి తో స్థానిక బాలుర సహాయముతో 217 దినములు పోరాడి ఆ తర్వాత ఇంగ్లాండ్ నుండి అధనపు సైన్యము రావడం తో బోయర్లపై విజయము సాధించెను. దీనితో అతని కీర్తి ప్రపంచం అంతా వ్యాపించెను. అప్పటి విక్టోరియా మహారాణి అతనిని  Genaral Rank  తో గౌరవించెను.ఆ యుద్ధం గెలుపొందిన తరువాత ఆ అశాంతి తెగ నాయకుడు Prem peh  ఎడమచేతి కరచాలనం తో అభినందించెను. అది వారు  bravest of the brave  (ధైర్య సాహసులకు) మాత్రమే ఇచ్చేవారు. అది వాళ్ళ ఆచారం.అంతమాత్రమే కాకుండా IMPHANA  అనే బిరుదును కూడా ఇచ్చారు. ఇంఫానా అనగా  " నిదురపోని తోడేలు " అని అర్థం.  తరువాత ఆ తెగ నాయకుడు తన మెడలో ఉన్న beeds necklace  తీసి b.P  గారి మెడలో వేసెను.

1907వ సం. లో 20 మంది బాలురతో Brown sea Iland  దగ్గర మొట్టమొదటి experimental camp నిర్వహించెను. అదే  ScouT  ఉధ్యమ ప్రారంభం. 1908 వ సంవత్సరం లో  Scouting for Boys  అనే పుస్తకం రచించెను. ఈ పుస్తకము Bible  తర్వత ఎక్కువగా అమ్ముడైన పుస్తకం గా చరిత్ర సృష్టించెను.

1909 లో  Crystal palace  లొ మొదటి స్కౌట్ ర్యాలి నిర్వహించెను. ఈ ర్యాలి కి ప్రపంచ నలుమూలలనుండి ఎందరో స్కౌట్స్ హాజరయ్యెను. ఈ సందర్భంలో కొంతమంది బాలికలు తమకు తామే Girl Scout అనే పేరు పెట్టుకొని తమను కూడా ఉధ్యమం లో చేర్పించుకోమని  B.P  గారిని అదిగారు .అప్పుడు B.P  బాగా ఆలోచించి తన సోదరి ఆగ్నస్ కి శిక్షణ  ఇచ్చి ఆమె ద్వారా గైడ్ విభాగం ను ప్రారంభించెను.

B.P  తన 55 వ ఏట 1912 లో Olave clair soams  ను వివాహం చేసుకొనెను ఈమె  Lady B.P  గా ప్రసిద్ది చెందెను. ఈమె పుట్టిన తేది 22 ఫిబ్రవరి 1889.నీరిరువురి జన్మదినం ఫిబ్రవరి 22 (ఒకేతేది ) కావున ఈ రోజును  Thinking day  గా ప్రపంచమంతా జప్రుపుకుంటున్నారు. వీరిరువురు కలసి 1921, 1937 సం. లో భారత దేశాన్ని సందర్శించి  ర్యాలీలలో పాల్గొని భారతీయ పిల్లల నైపుణ్యాన్ని ప్రశంసించారు.మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్దాలలో స్కౌట్స్ చేసిన సేవలు మరువలేనివి. ప్రపంచమంతటా స్కౌట్ ఉధ్యమజ్యోతులు వెలిగించిన బి.పి. గారు 08.01.1941 న పరమపదించెను.తర్వాత లేడి బి.పి ప్రపంచవ్యాప్తంగా ఉధ్యమ అభివృద్దికి కృషిచేసి 26.06.1977న స్వర్గస్థురాలయ్యెను.

భారతదేశం లో స్కౌటింగ్

1909 వ సంవత్సరం లో భారతదేశం లొ మొదటగా బెంగలూర్ లో ప్రారంభించబడెను. తర్వాత పూణే, జబల్ పూర్, మద్రాస్ లలో యూనిట్లు స్థాపించబడెను కాని అందులో కేవలము ఆంగ్లో ఇండియన్స్ వారిపిల్లలకు మాత్రమే ప్రవేశం. ఉండేది.1911ల్0ఎ మొదటి గైద్ కంపని జబల్ పూత్ లో ప్రారంభించబడెను.లక్నో లో అమెరికన్ మిషన్ స్కూల్ లో Girls messanger service  ప్రారంభించబదింది.1913 వ సంవత్సరం లో వివిన్ బోస్ గారు భారతీయ పిల్లలకోసం  central Girls Troop  ను ప్రారంభించెను. 1916 లో అనిబీసెంట్ , జి.యస్ అరండేల్ భారతీయ పిల్లలకోసం Indian boys scout association మద్రాస్ లో ప్రారంభించిరి .అప్పుడే  Indian Guide cpmpany  లు ప్రారంభం అయ్యెను. వారిని సిస్తెర్ గైడ్స్ అని పిలిచేవారు.

1917 లో భారతీయ పిల్లలకు శిక్షణ ఇచ్చు నిమిత్తం పండిత్ మదన్ మొహన్ మాలవ్యా, శ్రీరాం బాజపేయ్ , హృదయనాద్ కుంజ్రూ  గార్లు అలహాబాద్ లో సేవాసమితి స్కౌట్ అసొసియెషన్  ప్రారంభించిరి. 1921 లో B.P మరియు లేడి బి.పి  భారత్దేశం లో జరిగిన ర్యాలి కి హాజరై వారి సంతృప్తి వ్యక్తం చేసి భారతదేశం లోని స్కౌట్ సంస్థలన్నీ ఒకటి కావాలని సూచించారు. కాని అలా కొనసాగలేదు.1937 లో తిరిగి వారు ఇండియా ను సందర్శించినప్పుడు విలీనం గురించి సూచించారు.అప్పుదు కొన్ని గ్రూపులు విడిపోయినప్పటికి జాతీయ స్కౌట్స్ అసిసియెషన్, సేవాసమితి అసొసియేషన్ కలసి హిందుస్థాన్ స్కౌట్ అసోసియేషన్ గా ఏర్పడెను.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ప్రధాని నెహౄ మరియు అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్కౌట్ సంస్థలతో చర్చలు జరిపి 11.07.1950 వతేదీన.స్కౌట్ అసోసియేషన్ మరియు బాయ్స్ స్కౌట్ అసోసియేషన్ కలసి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గా ఏర్పడెను.     

2.Scout Law: -

* A Scout is trustworthy

* A Scout is loyal

* A Scout is a friend to all and a brother to every other scout

*A scout is courteous

* A Scout is a friend to animals and loves nature

*A Scout is Disciplined and protect public property

* A Scout is courageous

* A Scout is thrifty

* A Scout is pure in thought and word and deed

3. PROMISE :  On my honour I promise that  I will do my best To do my duty to God and my country to help other people and to obey the scout law

4.Motto : motto అనగా ఆశయము. స్కౌట్ మోటో  Be Prepared  అనగా ఎప్పుడూ సంసిద్దంగా ఉండాలి అని అర్థం. శారీరక దృఢత్వము మానసిక అప్రమత్తతతో  నైతిక సరళతతో ఉండవలెను. Scout తన విధిని నిర్వర్తించుటకు అన్ని సమయములలో సిద్ధంగా ఉండవలెను. తనతోటివారికి సహాయము చేయుటకు ఏ ఆజ్ఞ ఇవ్వబడినను ఎట్టి కష్టమైనను లెక్కచేయక వెంటనే నిర్వర్తించుటకు సిద్ధంగా ఉండాలి. నేను సిద్ధంగా లేను అని పనులను వాయిదా వేయరాదు.   

5.Scout salute: Scout

 తన కుడిచేతి మూడువ్రేళ్ళను నిటారుగాను, చిటికన వ్రేళుపై బొటన వ్రేలును ఆనించి కుడి బూజమునకు సమాంతరంగా  ఉంచి కుడి కనుబొమ్మపై తన చూపుడువ్రేలును ఆనించి ఉంచిన Scout salute  అగును 

6. Scout Sign :

 తన కుడిచేతి యొక్క చితికెన వ్రేలుపై బొటన వ్రేలు ఆనించి చూపుడు వ్రేలును మధ్యవ్రేలును ఉంగరపు వ్రేలును ఆకాశమును చూచునట్లుగా ఒండవలెను.కుడి బుజమునకు సమాన ఎత్తులో ఉంచి ఈ sign ను చూపించవలెను. దీనిలో నితారుగా ఉన్న మూడు వ్రేల్లు తన ప్రతిజ్ఞను జ్ఞాపకము తెచ్చును. అనగా * చూపుడువ్రేలు నేను నా గౌరవ సాక్షిగా నా శక్తికొలది దేవునికి, దేశానికి నా విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చెదనని, రెండవ వ్రేలు ఇతరులకు ఎల్లవేళలా సహాయము చేసెదననియు, మూడవ వ్రేలు  స్కౌట్ చట్టమును పాటించెదనని తెలుపును. చిటికనవ్రేలు మరియు బొటన వ్రేలు కలసియుండుట ఐకమత్యమును తెలుపును

7. Left Hand Shake :

 ఒక స్కౌట్ మరొక స్కౌట్ కలసినప్పుడు ఎడమచేతితో కరచాలనము చేసుకొనవలెను. ఈవిధంగా కరచాలనము మన స్కౌట్ మరియు గైడ్ వారు మాత్రమే చేయుదురు. సాదారణ దుస్తులలో ఉన్నప్పటికి ఎడమచేతి కరచాలనం ద్వారా స్కౌట్ వారిని సులభంగా గుర్తించ వచ్చును.

      స్కౌట్  ఉధ్యమపితామహుడు బేడెన్ పావెల్ గారు దక్షిణాఫ్రికాలో అశాంతి తెగవారితో యుద్ధం గెలిచిన తరువాత ఆతెగ నాయకుడు బేడెన్ పావెల్ గారికి తమ తెగ ఆచారం ప్రకారం వీరులకు మాత్రమే ఇచ్చే ఎడమచేతి కరచాలనం ఇచ్చెను అప్పటి నుండి మన స్కౌట్స్ ని కూడా వీరులుగా గుర్తించి  ఒకరికొకరు ఎడమచేతికరచాలనం చేసుకుంటారు.

8.Good turn (పరోపకార పనులు) : ప్రతి స్కౌట్ పరోపకారం చేయుట లక్ష్యం గా పెట్టుకొనవలెను.ఇట్టి పరోపకార పనులు అంగవికలురకు , ముసలివారికి అనాధలకు ఎవరికైనను తనకు తోచినవిధంగా సహాయము చేయవలెను.. ఇట్టి సహాయము చేసినప్పుడు ఇతరులనుండి ప్రతిఫలము ఆశించకూడదు. ప్రతి స్కౌట్ తను చేసిన పరోపకార పనులను తమ స్కౌట్ మాస్టర్ కు ఎలియజేసి తన డైరీలొ నమోదు చెసుకోవలెను.తను చేయవలసిన మంచి పనులను జ్ఞాపకము ఉంచుకొనుటకు Scarf  చివర రెండువైపులా చిన్న ముడిని వేయవలెను దీనిని Good turn knot  అంటారు. ఈ knot తన క్ర్తవ్యమును ంజప్తికి తెచ్చి శ్రమదానము చేయుమని ప్రభొదించును.అప్పుడు స్కౌట్ పరోపకార పనులు చేసి తన స్కార్ఫ్ చివర ఉన్న ముడిని విప్పుకొనవలెను. 

స్కౌట్ ఈ క్రింద తెలిపిన పనులలో ఏవైనా చేయవచ్చును

*. ముదుసలివారికి కట్టెలు కొట్టుటలొ సహాయము చేయుట

.* చిన్న పిల్లలను గ్రుడ్డివారిని రోడ్ దాతించుట.రోద్ మధ్యన ఆగిపొయిన వాహనములను తోయుటలో సహకరించుట

* బరువైన  సామనులను తలపైకి ఎత్తుట

*చెట్లను నాటి వాటికి నీరుపోయుట

*అనారొగ్యముగా ఉన్న వారికి వారిపనులలో సహాయము చేయుటా

*ఇంట్లో అమ్మకు వంట మొదలగు పనులలో సహాయము చేయుట

* జాతరలలో క్యూ లైనులను ఏర్పాటు చేయుట

* బరువైన సామానులను మోయుటలో సహాయము చేయుట

*దాహముగా ఉన్న పశువులకు నీరు త్రాగించి ఆహారము వేయుట మొదలైనవి

9. National Flag:

జాతీయ పతాకము

భారతీయ గౌరవానికి ప్రతీక  జాతీయ జందా. ఇది మూడురంగులు కలిగియుండును. మధ్యలో అశోక చక్రం కలిగి ఉంటుంది.ప్రతి స్కౌట్ తన జాతీయ పతాకం గురించి తెలుసుకొని ఉండాలి. దానిని గౌరవించుట తన విధి. తన జండా ప్రతిష్టనిలుపుటకొరకు అవసరమైతే తన ప్రాణములను బలి ఇచ్చుటకు సంసిద్ధుడై ఉండవలెను.

జాతీయపతాకము యొక్క పొడవు వెడల్పునకు ఒకటిన్నర రెట్లు ఉండును, ఎంత పెద్ద పతాకమైనా ఎంత చిన్నదైనా దాని పొడవు వెడల్పులు 3: 2 నిష్పత్తి లో ఉండవలెను. మన త్రివర్ణ పతాకంలో మీది రంగు కాషాయం మధ్యలో తెలుపు అడుగున ఆకుపచ్చరంగు ఉండును> మధ్యగల తెలుపురంగులో నీలిరంగుతో 24 ఆకుల( SPOKES) అశోకచక్రము కేంద్రస్థానము ఆక్రమించి ఉండును. పతాకము  తయారుచేయుటకు గాలికి చిరిగిపోవు మిక్కిలి పలుచటి గుడ్దగాని అసలే ఎగురని మొద్దు గుడ్డగానిఉపయోగించరాదు. నూలు గాని పట్టు తో తయారు చేసిన జండాలను వాడవలెను. తడితగిలిన చిరిగిపెని , తొందరగావెలిసిపోని  వాటిని వాడ వలెను

మన జాతీయ పతాకములోని కాషాయరంగు  త్యాగమును, తెలుపురంగు శాంతికి, ఆకుపచ్చరంగు సస్యశ్యామలము మరియు అభివృద్ధికి చిహ్నము. మధ్యలోగలధర్మచక్రము అశోకుని ధర్మపరిపాలనను జ్ఞప్తికితెచ్చును.చక్రములోని 24 ఆకులు దినములోని 24 గంటలు న్యాయమార్గములో ప్రయాణించవలెనని తెలుపును

జండా ఎగురవేయుటకు నియమము :- సూర్యోదయము నుండి సూర్యాస్తమయము లోపు మాత్రమే జండా ఎగురవేయవలెను.సూర్యాస్తమయం తరువాత జండా దించవలెను. జాతీయ పతాకం పక్కన దానికంటే ఎత్తులో మరే ఇతర జండాలు ఎగురవేయరాదు. జండాను దించునప్పుడు నేలను తాకరాదు.

Note : జాతీయ పతాక రూపకర్త పింగళివెంకయ్య

10. Bharat scouts & Guides Flag :: భారత స్కౌట్స్ , గైడ్స్ పతాకము కూడా జాతీయ పతాకమువలెనేపొడవు వెడ్ల్పునకు ఒకటిన్నర రెట్లు ఉండవలెను అంగా పొడవు వెడల్పుల నిష్పత్తి 3: 2 ఉండవలెను. జండా నీలిరంగులో ఉండును మధ్యలో ఫ్లుయెర్- డిలిస్  పసుపురంగులోను దాని మధ్యలో అశోకచక్రము నీలిరంగు లోను ఉండును. ఈ పతాలము లోని నీలిరంగు ఆకాశం వలె నిర్మలత్వమును సూచించును. స్కౌట్ లేదా గైడ్ యొక్క హృదయము కూడా ఆకాశం వలె నిర్మలమై అపారమై ఉండవలెను .ఎందుకనగా అనంతమగు ఆకాశముకూడా నీలిరంగునే కలిగి ఉన్నది.

కొలతలు : 3:2 అనగా 180 సెంటీమీటర్లు పొడవు , 120 సెంటీమీటర్లు వెడల్పు

           స్కౌట్ చిహ్నము 45 సెంటీమీటర్లు పొడవు , 30 సెంటీమీటర్లు వెడల్పు ఉండాలి.    

  11. World Scout Flag : ప్రపంచ స్కౌట్ పతాకము : ఊదారంగు గల గుడ్డపై పధ్యలో ప్రపంచ స్కౌట్ చిహ్నము కలిగియుండును. ఇదికూడా అన్ని పతాకముల వలె 3:2 నిష్పత్తి కలిగియుండును. ఈ చిహ్నము చుట్టు వలయాకారములో ఒక త్రాడు క్రిందిభాగములో దర్భముడి (REEf KNOT ) ఉండును. మధ్యగల బాణము గుర్తు క్రమ మార్గమును  సూచించును. చిహ్నములోని మూడు దళములు 3 ప్రతిజ్ఞలను తెలుపును. ఇరువైపునగల దళములోని నక్ష్త్రముల పది కోణములు స్కౌట్ యొక్క చట్తమును తెలుపును. .ఈ పతాకమును 2961 వ సంవత్సరములో లిప్సన్ లో జరిగిన 18వ ప్రపంచ స్కౌట్ సమావేశములో ఆమోదించడం జరిగిందిదీనిని అంతర్జాతీయ సమావేశములలో మాత్రమే ఎగురవేస్తారు. దీనిని జాతీయ పతాకమునకు దిగువన తక్కువ ఎత్తులో ఎగుర వేయాలి           

Flag Song

Bharat Scout Guide Jhanda
Uncha Sada Rahega,
Uncha Sada Rahega Jhanda
Uncha Sada Rahega.
Neela Rang Gagan Sa Vistrit
Bhratru Bahv Phelata,
Tridal kamal Nit tin Pratigyao Ki Yad dilata.
Aur Chakr Kehta Hei Prathipal
Age Kadam Badega.
Uncha Sada Rahega Jhanda
Uncha Sada Rahega.

PRAYER PROCEDURE

స్కౌట్స్ అందరిని  అసిస్టెంట్ స్కౌట్ మాస్టర్ విజిల్ ద్వారా ఫ్లాగ్ ఏరియా కు రప్పించాలి

వచ్చిన వారందరిని పెట్రోల్ వారిగా Horse Shoe formation  గుర్రపునాడా ఆకారం లో నిల్చోబెట్టి ఒక సారి విశ్రాం , సావధాన్ చెప్పి స్కౌట్ మాస్టర్ కి చార్జ్ అప్పజెప్పుతారు .తర్వాత స్కౌట్ మాస్టర్ వచ్చి మరలా విశ్రాం, సావధాన్ చెప్పి మొదట ప్రార్ధన గీత్ పాడించి తర్వాత ధ్వజ్ లీడర్ చల్ దో అంటారు అప్పుడు ద్వజ్ లీడర్ వచ్చి flog hoist చేసి ఒక అడుగు వెనుకకు వెల్లి సెల్యూట్ చెస్తాడు అందరూ కలసి జండా గీత్ పాడిన తర్వత స్కౌట్ మాస్టర్ విశ్రాం , సావధాన్ చెప్పి స్వస్థాన్ చెబుతారు

INVESTITURE CERMONY

 

స్కౌట్ మాస్టర్ యూనిట్ ప్రారంభించిన తర్వాత వారికి 3 నెలలు శిక్షణ ఇస్తారు మూడు నెలల కాలంలో వారికి ప్రవేశ్ లో ఉన్న అంశలపై శిక్షణ ఇస్తారు. స్కౌట్స్ అందరూ అన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత వారికి investiture ( దీక్షా స్వీకారం) చేస్తారు. దీక్షా స్వీకారం చేయుటకు ట్రూఫ్ లీడర్ గానీ పెట్రోల్ లీడర్ గాని కొత్తవారిని వెంటబెట్టుకొని స్కౌట్ మాస్టర్ వద్దకు తీసుకొస్తారు అప్పుడు స్కౌట్ మాస్టర్ వారిచే ప్రతిజ్ఞ చేయించి మెడలో స్కార్ఫ్ వేసి మెంబర్ షిప్ బ్యాడ్గ్ పెట్టి స్కౌట్ సంస్థ లో కి ఆహ్వానిస్తారు 


No comments:

Post a Comment

my teaching